టాలీవుడ్ హిట్ మెషిన్ నాని మరోసారి తన మార్క్ చూపించాడు. తన తాజా చిత్రం HIT ది థర్డ్ కేస్ విడుదలైన నాలుగు రోజులలోపే రూ.100 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టి సెంచరీ కొట్టింది. సరిపొదా శనివారం సినిమా విజయవంతమైన రన్ తర్వాత, నానికి ఇది వరుసగా రెండో రూ.100 కోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.
A సర్టిఫికేట్ ఉన్న ఈ క్రైమ్ డ్రామా నార్త్ అమెరికాలో కూడా 2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. HIT 3 ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే దుమ్మురేపుతూ రూ.101 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్-ఈవెన్ మార్క్‌ను చేరుకుని, నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది.
నాని సరసన కన్నడ నటి శ్రీనిధి శెట్టి కూడా ముఖ్య పాత్రలో నటించింది. ఈ గంభీరమైన క్రైమ్ థ్రిల్లర్‌కు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని – ప్రశాంతి తిపిరినేని సంయుక్తంగా నిర్మించారు. చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
Also Read:28 మండలాల్లో భూ భారతి అమలు..

