చరిత్రలో ఈ రోజు : డిసెంబరు 30

214
History Today
- Advertisement -

(@డిసెంబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 364వ రోజు (లీపు సంవత్సరములో 365వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 1 రోజు మిగిలినది.@)

*సంఘటనలు*

1906: భారత్లో తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ లాంటి పార్టీ అవసరమని భావించిన ముస్లిం ప్రముఖులు ఢాకాలో సమావేశమై ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు.
1922: రష్యన్‌ సోవియట్‌ ఫెడరేషన్‌, ట్రాన్స్‌కకేషియన్‌, ఉక్రేనియన్‌, బెలారసియన్‌ సోవియట్‌ రిపబ్లిక్‌లు నాలుగూ కలిసి ద యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌గా ఏర్పడ్డాయి.
1968: ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ట్రిగ్వేలీ మరణించాడు.
2006: ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్ ను ఉరితీసారు.
2008: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రమాణస్వీకారం.
2009: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసోరెన్ ప్రమాణస్వీకారం చేశాడు.

*జననాలు*

1865 : ప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు కవి రుడ్యార్డ్ కిప్లింగ్ జననం. (మ.1936)
1879: రమణ మహర్షి, బోధనలలో ప్రధానమైనది “మౌనము” లేదా “మౌనముద్ర”. వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు
1887: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులు
1898: యలమంచిలి వెంకటప్పయ్య, స్వాతంత్ర్య సమర యోధుడు. కాకినాడలో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు,
1935 : భారతదేశపు ప్రముఖ చదరంగం ఆటగాడు మాన్యువెల్ ఆరన్ జననం.
1948 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్‌మెన్ సురీందర్ అమర్‌నాథ్ జననం.
1968 : హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు యొక్క సహ-వ్యవస్థాపకుడు సబీర్ భాటియా జననం.
1984 : అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్ జననం.

*మరణాలు*

1955: వేమూరి గగ్గయ్య, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. (జ.1895)
1971: విక్రం సారాభాయ్‌, ప్రముఖ శాస్త్రవేత్త.
1973: చిత్తూరు నాగయ్య, ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు.
1992: వడ్డాది పాపయ్య, ప్రముఖ చిత్రకారుడు.
2006: పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (జ.1918)

- Advertisement -