తిరుమలలో అన్యమత ప్రచారం

320
- Advertisement -

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుంది. గతంలో ఇలాగే అన్యమత ప్రచారం జరిగినప్పటికి ఇప్పటకి వాటిపై తగిన చర్యలు చేపట్టలేదు. టీటీడీ అధికారులు చోద్యం చూస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఇవాళ ఉదయం పాంచజన్య గెస్ట్‌ హౌస్ పార్కింగ్ లోని అన్యమతస్తుల వాహనం ఒకటి దర్శనమిచ్చింది. దీన్ని గమనించిన భక్తులు టీటీడీ అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడంలేదని అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

వాహనం గ్లాస్‌పై పెద్ద పెద్ద అక్షరాలతో ప్రైస్‌ ది లార్డ్‌ అనే స్టిక్కర్‌ తో తిరుమలకి వచ్చినప్పటికీ పట్టించుకొవడం లేదని భక్తుల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహాం వ్యక్తమవుతుంది. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద అధికారులు పట్టించుకోవడంలేదని విజిలెన్స్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల అన్యమతస్తుల వాహనం తిరుమలలో దర్శనమిస్తున్నాయని స్థానికులు అన్నారు. తిరుమల ధార్మిక క్షేత్రంలో హిందూ మతానికి సంబంధించిన తప్ప మరే ఇతర మతాల వారు ప్రార్థనలు గానీ మతప్రచారం చేయకూడదన్న నిషేధం ఉంది.

ఇవి కూడా చదవండి..

అన్‌స్టాపబుల్‌కి పొలిటికల్ టచ్‌!

మైన్‌పురి సమరంలో ఇద్దరు కోడళ్లు!

ఆస్పత్రిలో చేరిన నటుడు కృష్ణ..

- Advertisement -