ప్రకాశ్ రాజ్ పై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు

439
Prakash_Raj
- Advertisement -

సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ పై ఫిల్మ్ చాంబర్ లో ఫిర్యాదు చేశారు అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు. హిందూ దేవుళ్లు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ప్రకాశ్ రాజ్ ను సినిమాల నుంచి బహిష్కరించాలని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి మహాసభ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

కన్నడ సినిమాల్లో ప్రకాశ్ రాజ్ కు అవకాశం ఇవ్వొద్దని కోరారు. అయినప్పటికీ ఆయనకు అవకాశాలు కల్పిస్తే తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇటివలే ఓ టీవీ ఛానల్ చర్చలో పాల్గోన్న ప్రకాశ్ రాజ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ పై తీవ్ర విమర్శలు చేశారు.

యూపీలో నిర్వహించే రథోత్సవానికి ముంబై నుంచి విమానాల్లో మోడళ్లను పిలిపించి వారి ముఖాలకు రంగులు వేసి సీతారామ లక్ష్మణుల వేషాలు వేయించారని ఆరోపణలు చేశారు. వారికి ఐఏఎస్ అధికారులు కూడా నమస్కరించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు దేశానికే ప్రమాదకరం అని అన్నారు. కాన్నడ ఫిలిం ఛాంబర్ ప్రకాశ్ రాజ్ పై యాక్షన్ తీసుకుంటుందో లేదో చూడాలి మరి.

- Advertisement -