ఓటు హక్కు వినియోగించుకున్న హిల్లరీ..

255
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యూయార్క్‌లోని చప్పక్వాలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ స్టేషన్‌లో హిల్లరీ తన భర్త బిల్‌ క్లింటన్‌తో కలిసి ఓటు వేశారు. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న టిమ్‌ కెయిన్‌ తన భార్యతో కలిసి వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అమెరికా తూర్పు తీరంలో ఏడు రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమయింది. ఈస్టర్న్‌ టైమ్‌ జోన్‌ పరిధిలో వున్న న్యూయార్క్‌, కనెక్టికట్‌, ఇండియానా( కొన్నిప్రాంతాలు), కెంటకీ (కొన్ని ప్రాంతాలు), మైనె, న్యూజెర్సీ, వర్జీనీయా రాష్ట్రాల్లో పోలింగ్‌ ప్రారంభమైనట్టు సమాచారం. ఈ రాష్ట్రాల్లో అమెరికన్లతో పాటు ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా అధికసంఖ్యలో ఉన్నారు. ఉపాధ్యక్ష పదవికి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న టిమ్‌ కెన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ టైమ్‌జోన్లలో వున్నందున కొన్ని గంటల వ్యవధిలో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Hillary casts her vote near her home in New York State

బిల్ క్లింటన్ వైట్ హౌస్ ఖాళీ చేసినప్పటి నుంచి వారి కుటుంబం న్యూయార్క్ ఉత్తర శివారులోని చపాక్ ప్రాంతంలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. అటు రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సొంత ఊరు కూడా న్యూయార్కే కావడం గమనార్హం. ఈ ఇద్దరిలో ఎవరు న్యూయార్క్ ను విడిచి వాషింగ్టన్ డీసీకి వెళతారో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇక ఈ సారి అధ్యక్ష ఎన్నికలపై ఓట్లు బహుదాసక్తి కనబరుస్తుండటం విశేషం. ఒబామా మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు(2008లో) ఓటింగ్ శాతం దాదాపు 68గా నమోదయింది. ఈసారి అంతకుమించే ఓటింగ్ నమోదవుతుందని అంచనా!

Hillary casts her vote near her home in New York State

ఇక అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడిన సంగతి తెలిసిందే. యూఎస్ న్యూహాంప్‌ షైర్‌లోని మూడు ప్రాంతాల్లో ముందుస్తు పోలింగ్ ముగిసింది. రెండు ప్రాంతాల్లో హిల్లరీ,ఒక ప్రాంతంలో ట్రంప్ గెలుపొందారు మూడు ప్రాంతాల్లో కలిపి 57 ఓట్లు పోలవ్వగా…ట్రంప్‌కు 32,హిల్లరీ 25 ఓట్లు వచ్చాయి. డిక్స్ విల్లే, హార్ట్స్‌ పట్టణాల్లో హిల్లరీ గెలుపొందగా…మిల్స్ ఫీల్డ్ పట్టణంలో ట్రంప్ గెలుపొందారు.

https://youtu.be/7_mFcAQ9WmY

- Advertisement -