మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకొంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. ఐతే, ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ సీక్వెన్స్ పై ఇప్పుడు ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. అల వైకుంఠపురంలో బోర్డ్ సీన్ మాదిరిగానే ఈ సినిమాలో కూడా ఓ హిలేరియస్ సీన్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సీక్వెన్స్ లో మహేష్ క్యారెక్టర్ ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుందని.. మహేష్ కెరీర్ లోనే ఈ సీక్వెన్స్ చాలా కామిక్ గా ఉండబోతుందని టాక్. ముఖ్యంగా వెన్నెల కిషోర్ – సునీల్ పాత్రలను మహేష్ వాడుకుంటూ విలన్లను టార్గెట్ చేసే కోణంలో ఈ సీక్వెన్స్ సాగుతుందట.
ప్రస్తుతం ఈ కామిక్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ ని తీర్చిదిద్దుతున్నారు. వచ్చే వారం నుంచి అందులో షూటింగ్ ప్రారంభించడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అరవింద సమేత తరహాలోనే సాగే కథ ఇది. అలాగే పొలిటికల్ ఎలిమెంట్స్ కూడా ఉంంటాయి. దాంతో పాటుగా…. యాక్షన్ మూమెంట్స్, అండ్ ట్విస్టులూ జోడించుకుని వెళ్లాడట త్రివిక్రమ్. ఓ రాజకీయ అంశం కూడా ఈ కథలో కీలక భాగం కానుంది.
ఈ క్రమంలోనే సంజయ్ దత్ లేదా అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. తమిళ హాస్య నటుడు యోగిబాబుని మరో కీలక పాత్ర కోసం తీసుకున్నారు. సినిమాలో సగ భాగం ఢిల్లీ నేపథ్యంలో సాగనుంది. పైగా ‘అరవింద సమేత, అలా వైకుంఠపురంలో ఇలా వరుస హిట్ చిత్రాలను అందించి ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు త్రివిక్రమ్. దీనికితోడు ఈ సినిమాకి ఇండియా వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అయ్యేలా ఉంది
ఇవి కూడా చదవండి…