టాలీవుడ్లో బాహుబలి మూవీతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచుకుంది తెలుగు పరిశ్రమ. అయితే ఆ బెంచ్ మార్క్ కోసం.. స్థాయిలోనో లేదా దాన్ని మించిపోయేలా తమ భాషలోనూ ఓ సినిమా ఉండాలన్న తాపత్రయం అన్ని చోట్లా ఉంది. ఆ మధ్య కోలీవుడ్లో విజయ్ పులి సినిమాతో.. గత ఏడాది బాలీవుడ్లో అమీర్ ఖాన్ తగ్స్ అఫ్ హిందుస్థాన్తో ఇలాంటి ప్రయత్నాలే చేశారు. అయితే అవి కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో బాహుబలి రికార్డ్స్ అన్ని అలాగే భద్రంగా ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రయత్నాలకు మాత్రం ఇంకా తెరపడలేదు.
ప్రస్తుతం ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చారిత్రాత్మక సినిమాలు.. రామాయణ మహాభారతాలను వెండితెరపై ఆవిష్కరించడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ తరహా సినిమాలలో చేయడానికి స్టార్ హీరోలు కూడా సై అంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళంలో విక్రమ్ కథానాయకుడిగా ‘మహావీర్ కర్ణ’ రూపొందుతోంది. 300 కోట్ల బడ్జెట్తో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి ఆర్.ఎస్. విమల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ మూవీలో ‘మహాభారతం’లోని కర్ణుడి పాత్రను మెయిన్ గా చేసుకుని ఈ సినిమా సాగుతుంది. ప్రస్తుతం చిత్ర ష్యూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. వేలాదిమంది జూనియర్ ఆర్టిస్టులతో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మహాభారత యుద్ధం 18 రోజులపాటు కొనసాగింది. ఈ యుద్ధంలో కర్ణుడి విశ్వరూప విన్యాసాన్ని అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం విక్రమ్ కెరియర్లోనే దీ బెస్ట్ మూవీ అవుతుందని అభిమానుల నమ్మకం.