బైక్‌పై ఆమె చేస్తున్న ఆ పని చూస్తే షాకౌతారు.. వీడియో

225
Woman seen shaving her legs
- Advertisement -

అది అందమైన మియామి నగరం అందులో ఓ బిజీ రోడ్డు. ట్రాఫిక్ విపరీతంగా ఉంది. రెడ్ సిగ్నల్ పడటంతో వాహనాలన్నీ ఆగాయి. అయితే అక్కడున్న వాహనాలలో ఓ బైక్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. అదేదో ఆ బైక్ కొత్తగా ఉందని కాదు. ఆ బైక్ వెనుక కూర్చున్న యువతి వల్ల. ఆ యువతి స్విమ్ సూట్ వేసుకుని ఉంది. మియామి నగరంలో స్విమ్‌ డ్రెస్‌లో తిరగడం మామూలే.. మరి అక్కడ జనాల దృష్టిని అది కూడా ఆకర్షించలేదు. కానీ వారిని ఆకర్షించింది ఆ యువతి చేస్తున్న పని. ఆ పని చూసి అక్కడున్న వారంతా షాక్‌కు గురైయ్యారని చెప్పాలి.

ఇంతకు అక్కడ ఆమె చేసిన పని ఏంటనేగా మీ సందేహం.. ఆ విషయానికే వస్తున్న.. ఆ యువతి బైక్‌పై కూర్చొని ఆమె కాళ్లపై వెంట్రుకలు తొలగించుకుంటూ కనిపించింది. చేతిలో రేజర్‌తో ఉన్న ఆమె గతవారం మియామి రోడ్లపై కనిపించింది. ఈ ఘటనను అక్కడ ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. దాన్ని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా.. నెటిజన్లను ఇది విపరీతంగా ఆకట్టుకుంది. ఎంతైనా ఇది మియామి స్పెషల్ అంటూ దీనిపై వారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -