ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్..జోరుగా బెట్టింగ్ లు

460
evms
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో…. దేశ వ్యాప్తంగా సర్వత్రా ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రిని నిర్దేశించే ఎన్నికలు కావడంతో అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటివలే ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పొల్స్ ను విడుదల చేశాయి పలు సర్వేలు. వీటిలో ఎక్కువ శాతం ఎన్డీయే నే తిరిగి అధికారం చేపడుతుందని చాలా సర్వేలు తెలిపాయి.

సొంతంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇక ఈఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై బెట్టింగ్ దందాలు జోరుగా నడుస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందెలు కాస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మరీ ఎక్కువగా బెట్టింగ్ నడుస్తుందని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా వైసీపీ, టీడీపీ పార్టీలపై బెట్టింగ్ నడుస్తుంది.

ఇక తెలంగాణలో కొంచెం తక్కువగా ఉన్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం బెట్టింగ్ ప్రభావం గట్టిగానే ఉందని చెప్పుకోవాలి. తెలంగాణలో ఎక్కువగా చేవెళ్ల, మల్కాజ్ గిరి, భువనగిరి పార్లమెంట్ పరిధిలో బెట్టింగ్ నడుస్తుందని సమాచారం. ఇక మిగతా స్ధానాల్లో టీఆర్ఎస్ పక్కాగా విజయం సాధించడంతో అక్కడ బెట్టింగ్ వేయాడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రెండు నెలలుగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు సాయంత్రం వరకూ తెలియనున్నాయి.

- Advertisement -