తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జయేష్ రంజన్ హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. జయేష్ రంజన్ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కాగా తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల బరిలో జయేష్ రంజన్ నిలవనున్నారు. కాగా తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి జయేష్ రంజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే క్యాట్ ఆమోదం లేనందున అతని నామినేషన్ ను తిరస్కరించారు.
దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర సీఎస్ అనుమతి ఉండటంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. మరోవైపు మాజీ ఎంపీ జితెందర్ రెడ్డి నామినేషన్ ను కూడా తిరస్కరించారు. తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడి పోటిలో జయేష్ రంజన్, రంగారావులు ఉన్నారు. ఈనెల 9వ తేదిన ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను హైదరాబాద్ లోనే నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.