ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్‌!

28
- Advertisement -

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన ప్రొ.కొదండరామ్‌,అమీర్ అలీఖాన్‌ల నియమమాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది.తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని వెల్లడించింది. దీంతో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బ్రేక్ పడింది.

ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ఖాన్‌లను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.

బీఆర్ఎస్ సర్కార్‌లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యారు దాసోజు శ్రావణ్, సత్యనారాయణ. గవర్నర్ తమ నియామకాలకు ఆమోదం తెలుపకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషిన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే కాంగ్రెస్ సర్కార్ కొదండరామ్, అమీర్ అలీకాన్‌ల పేర్లకు గవర్నన్ అమోదం తెలపడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దాసోజు. దీంతో ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్ పడింది.

Also Read:క్యాబేజీ రసం తాగితే..ఎన్నో లాభాలో!

- Advertisement -