పశ్చిమాసియాలో మళ్లీ హైటెన్షన్

4
- Advertisement -

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా కీలక సైనిక చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో అదనంగా భారీ సంఖ్యలో సైనిక బలగాలను మోహరించేందుకు అమెరికా ప్రణాళికలు రూపొందించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా మిలిటరీ మూవ్‌మెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

నివేదికల ప్రకారం.. పశ్చిమాసియాకు అదనంగా సుమారు 9 వేల నుంచి 10 వేల మంది అమెరికా సైనికులను తరలించే అవకాశం ఉంది. వీరితో పాటు యుద్ధ విమానాలు, నౌకాదళానికి సంబంధించిన కీలక వనరులను కూడా ఈ ప్రాంతంలో మోహరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అమెరికా నౌకాదళానికి చెందిన USS Theodore Roosevelt విమానవాహక నౌకను కూడా పశ్చిమాసియా ప్రాంతానికి తరలించే చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే USS George Washington విమానవాహక నౌక ప్రాంతంలో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో అమెరికా నౌకాదళం తన సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:‘మరకతమణి 2’..షూటింగ్ పూర్తి

ఇదే సమయంలో నవంబర్ నాటికి పశ్చిమాసియాలో మొత్తం మూడు క్యారియర్ స్ట్రైక్ గ్రూపులను మోహరించేలా అమెరికా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఒక క్యారియర్ స్ట్రైక్ గ్రూపులో విమానవాహక నౌకతో పాటు దానికి రక్షణగా పనిచేసే యుద్ధ నౌకలు, ఇతర సహాయక నౌకలు, విమానాలు ఉంటాయి. ఈ స్థాయిలో మోహరింపు జరిగితే ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

- Advertisement -