యువీ రికార్డును సమం చేసిన అభిషేక్

4
- Advertisement -

ఆసియా గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. శనివారం జరుగుతున్న గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సెమీఫైనల్‌లో శ్రీలంకపై ఆడిన జట్టుతోనే భారత్ ఫైనల్‌లో బరిలోకి దిగింది.

భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కేవలం 28 బంతుల్లోనే 61 పరుగులు చేసిన అభిషేక్ ఇన్నింగ్స్‌లో భారీ సిక్సర్లు, బౌండరీలు బాదాడు. అయితే అఫ్రాత్ మిన్హాస్ బౌలింగ్‌లో అతడి దూకుడైన ఇన్నింగ్స్‌కు తెరపడింది.

భారీ సిక్సర్ కొట్టిన తర్వాతి బంతికే అభిషేక్ ముందుగానే షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతిని మిస్ చేయడంతో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ వెంటనే స్టంపింగ్ చేశాడు. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది.

అభిషేక్ శర్మ ఔటైన తర్వాత ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చారు. ఇద్దరూ కలిసి పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడి కొనసాగిస్తున్నారు. అబ్రార్ అహ్మద్ వేసిన ఓవర్‌లో ఇషాన్, శ్రేయస్ చెరో బౌండరీ బాదడంతో భారత్‌కు 9 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ కేవలం 9 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది.
అనంతరం సుఫియాన్ ముకీమ్ బౌలింగ్‌లోనూ భారత బ్యాటర్లు దూకుడు కొనసాగించారు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ చెరో బౌండరీ కొట్టడంతో ఆ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. భారత బ్యాటర్ల దూకుడును చూసి పాకిస్థాన్ కోచ్ మైక్ హేసన్ సైతం ఆశ్చర్యానికి గురయ్యాడు.

ఇక అభిషేక్ శర్మ ఏడు సిక్సర్లు బాదడంతో మరో రికార్డును సమం చేశాడు. భారత్-పాకిస్థాన్ టీ20 మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో యువరాజ్ సింగ్ రికార్డును అభిషేక్ సమం చేశాడు. 2012లో అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌పై యువరాజ్ ఏడు సిక్సర్లు బాదగా.. తాజాగా నిషిన్‌లో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ కూడా ఏడు సిక్సర్లు కొట్టాడు.

Also Read:‘మరకతమణి 2’..షూటింగ్ పూర్తి

- Advertisement -