స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా?

60
- Advertisement -

చాలమందికి స్పైసీ ఆహారం తినడం ఇష్టంగా ఉంటుంది. కూరల్లోనూ, లేదా స్నాక్స్ లోనూ లేదా ఏ ఇతరత్రా వంటకాలు చేసిన అందులో కాస్త స్పైసీ ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. అందుకోసం కారం, మసాలా దినుసులను ఎక్కువగా దట్టిస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం మంచిదేనా ? అంటే ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తినే ఆహారంలో స్పైసీ ఎక్కువైతే.. ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందట. ముఖ్యంగా ఎసిడిటీ, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందట. ఈ సమస్యల కారణంగా జీర్ణ వ్యవస్థ కూడా మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

స్పైసీ ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు వచ్చే అవకాశం ఉందట. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు ఏర్పడతాయి. ఈ రోజుల్లో గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం తినే ఆహారంలో ఉప్పు, కారం, మసాలా దినుసులు.. ఎక్కువగా ఉపయోగించడం వల్ల గుండె రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల బీపీ ఉన్నవారు కచ్చితంగా స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండడమే మేలట. ఇవే కాకుండా స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటే చర్మ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తినే ఆహారంలో స్పైసీ ఎక్కువగా ఉండడం వల్ల చర్మంపై తేమ తగ్గిపోయి వివిధ రకాల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. ఇంకా ఇవే కాకుండా పైల్స్, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండడమే మంచిది.

Also Read:బాలయ్యతో రణబీర్..ప్రొమో అదుర్స్

- Advertisement -