దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. వాట్సాప్ ద్వారా కేసును విచారించారు ఓ హైకోర్టు న్యాయమూర్తి. అది కూడా ఆదివారం సెలవు రోజు కేసు విచారణ జరిగింది.తమిళనాడులో ధర్మపురి జిల్లాలో అభీష్ట వరదరాజస్వామి రథయాత్ర జరిగింది. అర్ధరాత్రి జరిగిన వేడుకల్లో రథానికి విద్యుత్ తీగలు తగిలి అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు.
దీంతో స్వామి వారి దేవాలయం అనువంశిక ధర్మకర్త పీఆర్ శ్రీనివాసన్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సత్వరమే విచారణ చేపట్టాలని కోరారు. ఇక ఆదివారం ఓ వివాహ వేడుకలో పాల్గొన్న జస్టిస్ జీఆర్ స్వామినాథన్ వాట్సాప్‌లోనే విచారణ చేపట్టారు. ఇరువర్గాల వారు వాట్సాప్‌లోనే వాదనలు వినిపించగా రథయాత్రను నిలిపేసేందుకు ఇన్స్పెక్టర్ ఆదేశాలివ్వలేరని తెలిపారు న్యాయమూర్తి. రథయాత్ర జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.