హైబీపీ ఉందా.. ఇలా చేయండి!

26
- Advertisement -

హైబీపీ అనేది నేటి రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. సాధారణ రక్తపోటు 120/80 కంటే ఎక్కువ నమోదైనప్పుడు హైబీపీగా పరిగణిస్తారు వైద్యులు. దీని కారణంగా గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంది. గుండె జబ్బులతో మరణిస్తున్న వారిలో అధికాశం హైబీపీనే ప్రధాన కారణం అనే అధ్యయనాలు చెబుతున్నాయి. మైకం కమ్మడం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె దడ వంటివి హైబీపీ లక్షణాలు. ఈ హైబీపీ తగ్గడానికి సరైన వైద్యం కూడా అందుబాటులో లేకపోవడం వల్ల దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. హైబీపీ నుంచి బయట పడటానికి మెడిసన్ తో పాటు జీవన విధానంలో మార్పులు అలాగే తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. .

హైబీపీని తగ్గించడంలో యాపిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. యాపిల్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడతాయి. అందుకే హైబీపీ పేషెంట్లు ప్రతిరోజూ కనీసం ఒక్క యాపిల్ తినాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక తినే ఆహారం విషయంలో ఎక్కువ శాతం తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలలో బీపీని అదుపులో ఉంచే గుణాలు ఉంటాయి. కాబట్టి బెండకాయ, బంగాళదుంప, వంకాయ, క్యాబేజీ, బీట్ రూట్, క్యారెట్.. వంటివి ఆహార డైట్ లో తప్పనిసరి చేర్చుకోవాలి.

ఇక కొన్ని రకాల చిట్కాలు కూడా హైబీపీని అదుపులో ఉంచుతాయి. దాల్చిన చెక్క పొడిని నిత్యం ఆహారంలో ఒక టి స్పూన్ మోతాదులో తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ అవుతుంది. ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఒకటి లేదా రెండిటినీ ప్రతిరోజూ తింటే హైబీపీ తగ్గిపోతుందట. వీటితో పాటు జీవన శైలిలో కూడా సూచనలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రతి రోజూ వ్యాయామం చేయడం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం వంటివి అలవాటు చేసుకోవాలి. తద్వారా హైబీపీ నుంచి విముక్తి పెండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే..!

- Advertisement -