- Advertisement -
పంజాబ్‌లో భారీ పేలుడు సంభవించింది. మొహాలీలోని ఇంటెలిజెన్స్ ఆఫీసు మూడో అంతస్తులో జరిగిన పేలుడుతో ఆఫీసు తలుపులు, అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు పదార్థాలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రాకెట్ లాంఛర్లతో దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడుకు దారి తీసిన కారణాలు తెలియాల్సి ఉంది. మొహాలీలో పంజాబ్ పోలీస్ ప్రధాన కార్యాలయం ఉంది. పేలుడు జరిగిన భవనం సమీపంలో సుహానా సాహెబ్ గురుద్వారా ఉన్నది. ఈ దాడితో సమీప భవనాలు కూడా దెబ్బతిన్నాయి.
ఘటన జరిగిన వెంటనే ఈ ప్రాంతాన్నీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీసీటీవీ కెమెరాలను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
- Advertisement -