హిమాచల్, తిరుమలలో హై అలర్ట్

20
- Advertisement -

జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడి తరహాలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.

అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖకు హిమాచల్ సీఎం ఆదేశాలు జారీ చేశారు. చంబా, కాంగ్రా జిల్లాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులను ఆదేశించారు సీఎం సుఖ్వీందర్ సింగ్.

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్ లోని పలుచోట్ల ఆర్టీసీ బస్సులు,ప్రైవేట్ వాహనాలు, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది.

Also Read:కోదండ రామస్వామి ఆలయంలో పుష్పయాగం

- Advertisement -