తెలంగాణలో మిడతల దండు.. అప్రమత్తంగా ఉండాలి..

285
Locusts in Telangana
- Advertisement -

యశంకర్ భూపాలపల్లి జిల్లాలో మిడతల దండు దాడి చేసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం తెలిపారు. మిడతల దండు దాడి పొంచి ఉన్నదనే హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మహదేవపూర్ మండలంలోని మెట్ పల్లి గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజలతో మాట్లాడి ప్రజలకు మిడతల దండు దాడిపై అవగాహన కల్పించి అప్రమత్తం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మిడతలు అదిలాబాద్ దిశగా వస్తున్నట్టు సమాచారం తెలుస్తుందని, గాలివాటం దక్షిణం దిక్కు విస్తే అవి ఐదు,ఆరు జయశంకర్ జిల్లా వైపు వచ్చే అవకాశం ఉన్నదని, మహదేవపూర్ మండలంలోని అన్నారం, మెట్పల్లి, బీరసాగర్ తదితర గ్రామాలపై ముందు దాడి చేసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తు చర్యగా అధికారులను, సర్పంచులను, పంచాయతీ సెక్రెటరీలను అప్రమత్తం చేసి దాడిని ఎదుర్కొనేందుకు రసాయనాలను,స్ప్రే లను సిద్ధం చేశామన్నారు.

మిడతలు వస్తే ఒక మేఘంలాగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వస్తాయి కాబట్టి అవి వస్తే మనకు ఒక గంట ముందుగానే కచ్చితమైన సమాచారం అందుతుంది కాబట్టి సమాచారం అందిన వెంటనే అధికారులచే దండోర వేయించి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కాకపోతే రాత్రి,పగలు అప్రమత్తంగా ఉండాలని, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ అధికారుల ఫోన్ నెంబర్లను దగ్గర ఉంచుకొని సహాయం అవసరం ఉన్నప్పుడు ఫోన్ లో సంప్రదించాలన్నారు.

మిడతలు దాడి చేస్తే పంట పొలాలు, పచ్చని మొక్కలపై దాడిచేస్తాయి మనుషులకు ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు. కానీ అవి ఎక్కువ సంఖ్యలో రావడం వలన ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున.. మిడతల దాడి వలన జిల్లాలో ప్రాణం, పంటలు మరియు వృక్ష సంపదకు నష్టం కాకుండా గ్రామాల్లో గ్రామస్తులు వంతుల వారీగా రాత్రులు గస్తీ నిర్వహించుకొని అప్రమత్తంగా ఉండాలని అన్నారు.మహారాష్ట్ర,తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతమైన మహదేవపూర్ మండలం పెద్దంపేట శివారులోకి మిడతల దండు ప్రవేశించిందని తెలిస్తోంది.

- Advertisement -