హాయ్ నాన్న…క్లీన్ యూ

31
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

‘హాయ్ నాన్న’ ఆడియో ఇప్పటికే సెన్సేషనల్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా మ్యూజికల్ నైట్ ఈవెంట్ నిర్వహించింది. భారీ ఎత్తున అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్న ఈ వేడుక కన్నుల పండగగా జరిగింది. మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో హీరో నాని ‘కమ్మని ఈ ప్రేమలేఖనే” పాటను పాడి అభిమానులని అలరించారు. నాని, మృణాల్ ఠాకూర్ కలసి హాయ్ నాన్న చిత్రంలోని ఓడియమ్మా పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబధించిన వీడియోలు వైరల్ గా మారి టాప్ ట్రెండింగ్ లో వున్నాయి.

ఇక తాజాగా ‘హాయ్ నాన్న’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ‘హాయ్ నాన్న’ అని సెన్సార్ బోర్డ్ చిత్ర యూనిట్ ని అభినందించింది.

Also Read:Bigg Boss 7 Telugu:ఓటింగ్- ఎలిమినేషన్‌కి లింక్ లేదు

మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఈ మ్యూజికల్ నైట్ ని నిర్వహించడం, ఈ సాయంత్రం ఇంత హాయిగా గడపటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అభిమానులు ఇచ్చిన ఎనర్జీ చూస్తుంటే కడుపునిండిపోయింది. నా ప్రతి సినిమాకి ఇలాంటి వేడుక ఒకటి ఉండేలా చూస్తాను. హాయ్ నాన్న టీం అందరికీ థాంక్స్, అందరూ ప్రాణం పెట్టి సొంత సినిమాలా పని చేశారు. వారందరికీ పేరుపేరునా థాంక్స్. దర్శకుడు శౌర్యువ్ ఎన్నో చిత్రాలు తీస్తారు. కానీ హాయ్ నాన్న తనకి చాలా ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుంది. తను చాలా పరిణితి గల దర్శకుడు. చాలా అద్భుతమైన చిత్రాన్ని అందించారు. మృణాల్ అద్భుతంగా నటించింది. ఈ సినిమా తర్వాత తనని అందరూ యష్ణ గా గుర్తుపెట్టుకుంటారనే నమ్మకం వుంది. బేబీ కీయరా కూడా చక్కగా నటించింది. హెషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమా చూశాను. చాలా అద్భుతంగా వుంటుంది. టీజర్ ట్రైలర్ లో చూసిన ఎనర్జీ వేరు .. సినిమాలో కనిపించే ఎనర్జీ వేరు. ఆ ఎనర్జీ అడక్టివ్ గా ఛార్మింగ్ గా ఉండబోతుంది. అది మీరు 7న చూస్తారు. మాములుగా మొదటి రోజుకి సినిమా టికెట్లు దొరకవు. మేము గురువారం విడుదల చేస్తున్నాం కాబట్టి మొదటి రోజు టికెట్లు దొరకొచ్చు. రెండో రోజు నుంచి టికెట్ ముక్క కూడా దొరకదనే నమ్మకం నాకు వుంది. ఇలాంటి అందమైన కథలు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ కావాలి. ఇలాంటి మంచి కథలు రావాలి. నటులని దర్శకులని మేటివేట్ చేయాలి. అది హాయ్ నాన్న చేస్తుందనే నమ్మకం వుంది. డిసెంబర్ 7న థియేటర్ లో కలసి హాయ్ నాన్న ఎంజాయ్ చేద్దాం. వీకెండ్ అంతా కుదిరితే మళ్ళీ మళ్ళీ చూద్దాం అన్నారు

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు, హాయ్ నాన్న నాకు చాలా స్పెషల్ మూవీ.హెషమ్ వండర్ ఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమాతో ఆయన ఇంకా బిజీ అయిపోతారు. నాని గారు ఆన్ స్క్రీన్ అద్భుతమైన మ్యాజిక్ క్రియేట్ చేశారు. మహి,విరాజ్ పాత్రల్లో మ్యాజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. హాయ్ నాన్న మార్వలెస్ మూవీ. సీతారామం తర్వాత నేను చేసిన చిత్రాల్లో నా మనసుకు బాగా దగ్గరైన చిత్రం హాయ్ నాన్న. శౌర్యవ్ గారు అద్భుతమైన దర్శకుడు. డిసెంబర్ 7 థియేటర్ లో హాయ్ నాన్న చూడండి. అదిరిపోతుంది’ అన్నారు.

Also Read:బీజేపీ గెలిచిన 8 స్థానాలివే..

- Advertisement -