శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం..

184
Srisailam Project
- Advertisement -

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో మూడు క్రస్ట్‌ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుండి ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్‌ నిండుకుండను తలపిస్తోంది.

ప్రస్తుతం జలాశయానికి 68,901 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884.80 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు.. ప్రస్తుతం 214.8540 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. దీంతో అధికారులు దిగువకు 1,10,874 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో కొనసాగుతున్న కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -