ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు పార్టీ ఇన్ చార్జీలుగా మరో ఇద్దరు నేతలు..

122
minister errabelli dayakar

వ‌రంగ‌ల్, ఖమ్మం, న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు మ‌రో ఇద్ద‌రు నేత‌ల‌ను ఇన్ చార్జీలుగా నియ‌మించిన‌ట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు తెలిపారు. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి కుడా (కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ) చైర్మ‌న్ మ‌ర్రి యాద‌వ‌రెడ్డిని నియ‌మించారు.స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మ‌న్, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాంబారి స‌మ్మారావుని నియ‌మించారు.

ఇప్ప‌టికే నియ‌మితులైన నేత‌ల‌తోపాటు వీరు కూడా ఇన్ చార్జీలుగా ప‌ని చేస్తార‌ని మంత్రి తెలిపారు. వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లపై వ‌రంగ‌ల్ లో ఆదివారం జ‌రిగిన స‌మాయ‌త్త స‌మావేశంలో పార్టీ అధినేత సిఎం కెసిఆర్, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ల ఆదేశానుసారం, ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రి వివ‌రించారు.