హీరోలు కన్నా సమంతే తోపు..  అవునా ?

180
- Advertisement -

మీరు గమనించే ఉంటారు కదా… ‘యశోద’ సినిమా మార్నింగ్ షో పూర్తి కాకముందే పాజిటివ్ కామెంట్స్ అండ్ పాజిటివ్  రివ్యూస్ బయటకు వచ్చాయి. పైగా  సమంత పై  బోలెడు ప్రశంసలు. రీజన్ సింపుల్… ‘యశోద’  పీఆర్ టీం ఎఫిషియంట్ వర్కే కారణం. దీనికితోడు తను మెయిన్ లీడ్ గా చేసిన యశోద సినిమాకి సక్సెస్ టాక్ రావడంతో సమంత కూడా బయటకు వచ్చి సినిమాకి బాగా ప్రచారం చేసి పెట్టింది. దీనికితోడు మొదటి రోజు నుంచే వసూళ్ల మీద బోలెడు కథనాలు వైరల్ అయ్యాయి. ఒక విధంగా టీమే వాటిని హైలైట్ చేసింది.

కాకపోతే.. యశోద కలెక్షన్స్ కి, పోస్టర్స్ మీద యశోద టీమ్ ముద్రించిన కలెక్షన్స్ కి ఎక్కడా పొంతన లేదు. తప్పులేదు, పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలే  వసూళ్ల లెక్కలను ఇలా అధికంగా ప్రచారంలోకి పెడుతుంటారు.  వాటిల్లో చాలావరకు అబద్ధాలే ఉంటాయి. ఇక సమంత యశోద ఎంత. కానీ తమ సినిమా వసూళ్ల గురించి ఏం రాసుకున్నా పర్వాలేదు.  కానీ మంచు విష్ణు జిన్నాతో, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమాతో యశోద కలెక్షన్స్ ను  పోలుస్తూ కథనాలు రావడమే ఇప్పుడు సమంత తలనొప్పిగా మారింది.

హీరోలు కన్నా సమంతే తోపు, సామ్ తో పోల్చుకుంటే చిన్నాచితకా హీరోలందరూ  వేస్ట్ అనేట్టుగా కథనాలు రావడం సమంత కే నష్టం. అయినా,  ఏ సినిమాను ఆ సినిమా కోణంలోనే చూడాలి.  ఏ హీరోను ఆ హీరో కోణంలోనే చూడాలి. హీరోయిన్ తో హీరోలను పోల్చకూడదు. ఈ పోలికలు అనవసరంగా సమంతకి మైనస్ చేసేవే. అయినా యశోద ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. కాకుండానే ఇన్నీ కోట్లు  అన్నీ కోట్లు డప్పు కొట్టుకోవడం మంచిది కాదు.

ఇవి కూడా చదవండి…

వైరల్ :  ‘మోడీ – మెగాస్టార్’ మధ్య ట్వీట్ల చర్చ !  

అసలు సంగతి చెప్పిన దిల్ రాజు

ప్రభాస్ తో కుర్ర హీరో పోటీ !

- Advertisement -