‘ధమాకా’ రవితేజకి కీలకం !

148
- Advertisement -

రవితేజ నెక్స్ట్ రిలీజ్ ‘ధమాకా’ మీద ఆయన అభిమానులు చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెంచుకున్నారు. ఈ సినిమాతో రవితేజ ఓ సూపర్ హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు. క్రాక్ తర్వాత రవితేజ నుండి వచ్చిన సినిమాలు నిరాశపరచడమే దీనికి కారణం. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఖిలాడి తో పాటు రామారావు కూడా బాక్సాఫీస్ దగ్గర చతికల పడ్డాయి. ఇప్పుడు ధమాకా మీదే ఆశలు పెట్టుకున్నారు మాస్ మహారాజా అభిమానులు.

ధమాకా లో డబుల్ ఎంటర్టైన్ మెంట్ గ్యారెంటీ అంటూ టీం గట్టుగానే చెప్తున్నారు. ఇప్పటికే ఆల్బంలో మాస్ సాంగ్ మిలియన్ల వ్యూస్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది. కాకపోతే తాజాగా రిలీజైన టీజర్ కి మాత్రం ఆశించిన రెస్పాన్స్ దక్కలేదు. టీజర్ చూస్తే రొటీన్ కంటెంట్ తో వస్తున్న రొటీన్ మూవీ అనిపిస్తుంది. కానీ ట్రైలర్ వచ్చే వరకూ చెప్పలేం.

ఈ సినిమాకు ప్రసన్న కుమార్ కథ మాటలు అందిస్తుండగా త్రినాద్ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు ‘సినిమా చూపిస్తామావ’ , ‘నేను లోకల్’ సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. కానీ మూడో సినిమా ‘హలో గురు ప్రేమకోసమే’ తో నిరాశ పరిచాడు. మరోసారి అల్లుడు మామ స్టోరీ తో మెప్పించలేకపోయాడు. సో రవితేజ కే కాదు, త్రినాద్ రావు , ప్రసన్న కి కూడా ఈ సినిమా సక్సెస్ కీలకం.

ఇవి కూడా చదవండి…

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం…వినోదం,ఎమోషన్

వైరల్ :  ‘మోడీ – మెగాస్టార్’ మధ్య ట్వీట్ల చర్చ !  

ప్రభాస్ తో కుర్ర హీరో పోటీ !

- Advertisement -