చిరుని ఆటపట్టించిన హీరోయిన్లు..

132

గతస్మృతులు , మధురస్మృతులు పేరుతో జ్ఞాపకాలు దాచుకొని, కొన్ని సంవత్సరాల తర్వాత గుర్తుకు తెచ్చుకుని ఆనందించడం చాలా మందికి అలవాటు. పాత సినిమాలలో చిన్నప్పుడు రాసుకున్న ఉత్తారాలు చూసి అలా పాత జ్ఙాపకాల్లోకి వెళ్లేవారు. అప్పటి ఉత్తరాల కన్నా ప్రజలు ఫోటోలలో నే ఎక్కువగా జ్ఞాపకాలు దాచుకున్నారు. అలా దాచుకుని కొన్ని సంవత్సరాల తర్వాతా అవి చూసుకుని నవ్వుకుంటారు. సోషల్ మీడియా దీనికి తోడు కావడంతో తమ జ్ఙాపకాలను తమ స్నేహితులకు, అభిమానులకు షేర్‌ చేస్తున్నారు నేటి రోజుల్లో.. ఈ ఫొటో చూశారా.. రెండు జడలు వేసుకుని సుమలత, చీరకట్టులో జయసుధ, గౌన్‌లో సుహాసిని చక్కగా ఉన్నారు కదా.

Chiru

ఒప్పుడు స్టార్‌ హీరోయిన్లుగా ఓ మెరుపు మెరిసిన వీరు ఈ ఫొటోలో మెగాస్టార్‌ చిరంజీవిని ఆటపట్టిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కుర్చీలో కూర్చొని ఉన్న చిరంజీవి వెనుక వారు చేస్తున్న పనులు తెలియక నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. జయసుధ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ ఫొటో పోస్ట్‌ చేస్తూ.. ‘జ్ఞాపకాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి. మేము తిరిగి వెనక్కి వెళ్లాలని కోరుకుంటున్నా’ అని పోస్ట్‌ చేశారు. మరి ఈ ఫొటో ఏ సందర్భంగా తీసిందో ఆమె వెల్లడించలేదు. ఈ నలుగురు నటీనటులున్న అరుదైన ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.