ఇసుక అక్రమార్కులపైన సర్జికల్ దాడులు…

219
Minister KT Rama Rao
- Advertisement -

ఇసుక అక్రమార్కులపైన సర్జికల్ స్ర్టయిక్స్ చేయాలని గనుల శాఖ మంత్రి కెటి రామారావు అధికారులకు అదేశాలు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణను అడ్డుకునేందుకు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖాల అధికారులతో జాయింట్ గ్రూపులు ఏర్పాటు చేసి తనీఖీలు చేపట్టలన్నారు. డంపుల్లోని ఇసుక ను స్థానిక అవసరాలకు కాకుండా అక్రమంగా ఇసుక తరలించే వారిని, వారి వాహనాలను సీజ్ చేయాలన్నారు. అక్రమ ఇసుక రవాణను అడ్డుకునేందుకు పోలీసు శాఖతో కలిసి కఠినంగా వ్యవహరించాలని మంత్రి అధికారులను అదేశించారు.

Minister KT Rama Rao

నూతనంగా సాగునీటి రంగంలో నిర్మిస్తున్న బ్యారేజీల్లో మైనింగ్ కు అందుబాటులో ఉన్న ఇసుక తవ్వకాలపైన జిల్లా కలెక్టర్లతో సచివాలయం నుంచి విడియో కాన్పరెన్సు నిర్వహించారు. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, నల్లగొండ, భూపాలపల్లి, మంచిర్యాల్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి విడియో కాన్ఫరెన్సు ద్వారా పలు అదేశాలిచ్చారు. సాగునీటి రంగ అభివృద్ధి కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో మునిగిపోయే ప్రాంతాల్లో (SUBMERGING AREA) పెద్ద ఎత్తున ఇసుక నిలువలున్నాయని, వీటిని మైనింగ్ చేసేందుకు అవకాశం ఉన్నదని ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను వాడుకోవచ్చని గనుల శాఖ అధికారులకు సూచించారు. సాధారణ ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండడం, ప్రభుత్వానికి అదాయం పెరగడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను అదేశించారు.

ప్రభుత్వ ప్రాజెక్టుల అవసరాలకు సరిపోయినంత ఇసుక అందుబాటులో ఉన్నదని, వీటితోపాటు టియస్ యండిసి ద్వారా వాణిజ్య అవసరాలకు సైతం దీన్ని ఉపయోగించాలన్నారు. కోట్లాది రూపాయల విలువైన ఈ ఇసుక నిల్వల ద్వారా ప్రభుత్వానికి ఘననీయమై అదాయం వస్తుందన్నారు. గతంలో మిడ్ మానేరు ప్రాజెక్టులో నీరు చేరడంతో అందులో అందుబాటులో ఉన్న ఇసుకను తవ్వి తీయలేక పోయామని, ఇలాంటి పరిస్థితి ఇతర ప్రాజెక్టుల్లో రావద్దని మంత్రి అధికారులను కోరారు. ఈ మేరకు నిర్మాణంలోని ప్రాజెక్టులు, వివిధ శాఖల్లోని సివిల్ పనులకు అవసరమైన ఇసుక పరిమాణ వివరాలు గనుల శాఖ అధికారుల వద్ద ఉండాలన్నారు.

ఇసుక మైనింగ్ గుర్తించేందుకు ప్రత్యేకంగా టియస్ యండిసి అధికారులు జిల్లాల్లో పర్యటించి కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. టియస్ యండి ద్వారా కొత్తగా ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ సమావేశంలో టియస్ యండిసి చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, సాగునీటి శాఖ, మైనింగ్ శాఖ ఉన్నతాధికారులున్నారు.

- Advertisement -