భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హీరోయిన్ తాప్సి

647
Tapsse
- Advertisement -

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ గా హీరోయిన్ తాప్సిని ఎంపిక చేశారు. ఇదేంటి తాప్సి క్రికెట్ ఆడటం ఏంటి అనుకుంటున్నారా? ప్రస్తుత భారత క్రికెట్ మహిళా జట్టు కెప్టెన్గా హైదరాబాద్ అమ్మాయి మిధాలి రాజ్ కొనసాగుతున్నారు. అయితే మిధాలీ రాజ్ జీవిత చరిత్రపై బయోపిక్ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో మిధాలీ రాజ్ పాత్రలో తాప్సి నటించనున్నారట. ఈ విషయాన్ని తాప్సి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో తెలిపింది.

ఇందుకు సంబంధించిన స్క్రీప్ట్ పనులు జరుగుతున్నాయని త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చెప్పింది. మిథాలీ పాత్రలో నటించే అవకాశం తనకు అవకాశం వస్తే అంతకన్నా సంతోషం మరొకటి ఉండదని ఈ సందర్బంగా తాప్సి చెప్పుకొచ్చింది. ఇటీవలే గేమ్ ఓవర్ సినిమా ద్వారా సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది తాప్సి. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనె తెలియనున్నాయి.

Heroine taapsee pannu to step into cricketer mithali rajs biopic

- Advertisement -