నాని సినిమాలో హీరోయిన్ గా స‌మంత‌..

642
samantha nani

అక్కినేని స‌మంత ఈమ‌ధ్య గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు కాకుండా క‌థ‌కు ఎక్కువ ప్రాముఖ్య‌త ఉన్న సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఇటివ‌లే ఆమె న‌టించిన రంగ‌స్ధ‌లం, యూ ట‌ర్న్ మంచి విజ‌యాల‌ను సాధించాయి. చిన్న పెద్ద హీరోలు అని తేడా లేకుండా క‌థ న‌చ్చితే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తుంది. ప్ర‌స్తుతం ఆమె త‌న భ‌ర్త నాగ చైత‌న్య‌తో క‌లిసి మ‌జిలీ అనే సినిమాలో న‌టిస్తుంది. ఈమూవీకి నిన్నుకోరి చిత్రం ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ బేబి మూవీలో కూడా న‌టిస్తుంది.

ega movie

తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం స‌మంత ఓ లేడి ఓరియెంటెడ్ మూవీ చేయ‌నుంద‌ని టాక్. అయితే ఈచిత్రాన్ని న్యాచుర‌ల్ స్టార్ నాని నిర్మించ‌నున్నాడ‌ట‌. అ! అనే సినిమాతో నిర్మాణ రంగంలోకి నాని అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో మ‌రో మూవీ నిర్మించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట నాని.

ఈమూవీకి స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో నాని నిర్మించాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డ‌నున్న‌ట్టు తెలుస్తుంది. నాని స‌మంత క‌లిసి ఎటో వెళ్ళిపోయింది మ‌న‌సు, ఈగ మూవీలో న‌టించిన విష‌యం తెలిసిందే.