ఆమె 30ఏళ్లుగా ఛాయ్ తోనే జీవ‌నం…

187
chai_wali_chachi

ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని కొరియా జిల్లా బ‌ర‌దియా గ్రామంలో పిల్లి దేవి అనే మ‌హిళా గ‌త ముప్ప‌యేళ్లుగా ఛాయ్ తాగుతూనే జీవనం సాగిస్తుంది. అక్క‌డి గ్రామ ప్ర‌జ‌లు ముద్దుగా ఆమెను ఛాయ్ వాలి చాచీ అని పిలుచుకుంటారు. ప్ర‌ధాని మెదీ ఛాయ్ అమ్మీ ఫేమ‌స్ అయితే ఈమె మాత్రం 30ఏళ్లుగా ఛాయ్ తాగుతూ ఫేమ‌స్ అయ్యింది. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంద‌ట‌. ఆమె తన పదకొండో ఏట ఫుడ్ తినడం మానేసిందని పిల్లి తండ్రి రతి రామ్ చెబుతున్నాడు.

ఆమె ఆరోత‌ర‌గ‌తిలో ఉండ‌గా ఒక‌సారి స్కూల్ త‌ర‌పున గేమ్స్ ఆడేందుకు జిల్లాలోని వేరోక ప్రాంతానికి వెళ్లింద‌ట అక్క‌డి నుంచి ఇంటికి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి అహారం తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ట‌. కేవ‌లం బ‌న్ మ‌రియు టీ మాత్ర‌మే తింటుంద‌ని చెబుతున్నారు ఆమె తండ్రి. అలాగే ఆమె అన్నం తిన‌క‌పోవ‌డంతో భ‌య‌ప‌డి ఆమె సోద‌రుడు చుట్టు ప‌క్క‌ల ఆసుపత్రుల్లో చూపించాడ‌ట‌. పిల్లి దేవిని ప‌రీక్షించిన వైద్యులు ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేద‌ని తేల్చి చెప్పారు. అలాగే రోజులు గ‌డుస్తున్నా ఆమె మాత్రం అన్నం ముట్ట‌డం లేదు. ఇప్ప‌టికి ఆమె టీ త్రాగుతూ బ్ర‌త‌క‌డంతో ఇది ఎలా సాధ్యం అని డాక్ట‌ర్లు ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట‌.