మళ్లీ ఇలాంటి కథలు రావు: సాయి పల్లవి

120
sai pallavi
- Advertisement -

రానా – సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. జూన్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా వరంగల్‌లో ఆత్మీయ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ… ఇలాంటి మంచి సినిమాల్ని ఆదరించకపోతే మళ్లీ ఇలాంటి కథలు రావు అని తెలిపింది. చాలా మంది ప్రేక్షకులు ఎదురుపడినప్పుడు అచ్చం మా అమ్మాయిలాగా లేదంటే మా చెల్లిలాగా ఉన్నావని అంటారు. మీరంతా ఇలా మీ ప్రేమని చూపిస్తున్నారు. అంత ప్రేమని మీకు ఎలా తిరిగిస్తాననే బాధ ఉంటుంది. ఊరి మట్టిలో నుంచి వచ్చిన ఇలాంటి కథల్లో నటిస్తే కొంచెమైనా తిరిగి ఇవ్వగలుగుతున్నాననే తృప్తి ఉందని తెలిపారు సాయిపల్లవి.

- Advertisement -