మలయాళ బ్యూటీ ప్రియా వారియర్ సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈసినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. మూవీ అట్టర్ ప్లాప్ కావడంతో హీరోయిన్ ప్రియా వారియర్ పై సంచలన కామెంట్స్ చేశారు దర్శకుడు ఒమర్, సహానటి నూరిన్. ప్రియా ప్రకాశ్ వల్లే ఈసినిమా ప్లాప్ అయ్యిందంటూ కామెంట్స్ చేశాడు. సినిమాలో అసలు హీరోయిన్ ప్రియా కాదని తాను కేవలం సాంగ్ లోని ఓ సన్నివేశంలో మాత్రమే ఉంటుందని తెలిపాడు. మొదట తనను హీరోయిన్ గా తీసుకుని ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్ రోల్ ఇవ్వడం పట్ల తాను చాలా బాధపడ్డానని తెలిపింది. ప్రియా వల్ల నా కెరీర్ నాశనం అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది నూరిన్.
ఇక తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించింది హీరోయిన్ ప్రియా ప్రకాశ్. అసలు ఏం జరిగిందో చెబితే వాళ్ల పరువే పొతుందని చెప్పింది. నన్ను విమర్శించే వారికి సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతానని తెలిపింది. అనవసరంగా తనపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. ప్రియా రోషన్ లు జంటగా నటించిన ఓరు ఆదార్ లవ్ సినిమా తెలుగు లో లవర్స్ డే పేరుతో విడుదలయ్యింది. తెలుగు ,మలయాళంలో విడుదలైన ఈమూవీ భారీ డిజాస్టర్ ను మూట గట్టుకుంది. ఇక ప్రియా చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు ఒమర్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.