సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరోయిన్ కైరా అద్వాని. తన గ్లామర్, అందమైన నటనతో కుర్రకారు మతిపోగొట్టేసింది. ఈమూవీ తర్వాత రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ విథేయ రామ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈసినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా ఆమె మూవీ ప్రమోషన్స్ లో పలు విషయాలు వెల్లడించింది. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం .. ‘వినయ విధేయ రామ’లో నటనతో పాటు డాన్స్ కి అవకాశం వున్న పాత్ర లభించడం నా అదృష్టం.
ప్రస్తుతం హిందీలో ‘కబీర్ సింగ్’ సినిమా చేస్తున్నాను .. ఇది ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్. ‘కబీర్ సింగ్’ సినిమా కోసమే నేను ‘అర్జున్ రెడ్డి’ చూశాను.ఈసినిమా చూసినప్పటి నుంచి నేను విజయ్ దేవరకొండ కి అభిమానిగా మారిపోయాను అని తెలిపింది. మహేశ్ బాబు, రామ్ చరణ్ తో సినిమా చేయడం వల్ల నాకు వాళ్ల ఫ్యామిలీస్ తో బాగా పరిచయం ఏర్పడింది. హైదరాబాద్ లో గనుక ఘాటింగ్ ఉంటే నేను వాళ్ల ఇంట్లోనే భోజనం చేస్తానని చెప్పింది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కే మూవీలో కైరాను హీరోయిన్ గా తీసుకొనున్నట్లు వార్తలు వస్తున్నాయి.