ఇస్మార్ట్ శంక‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా మ‌ణిశ‌ర్మ‌..

312
Pokiri-Combination For IsmartShankar
- Advertisement -

టాలీవుడ్ డేరింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో రామ్ సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. పూరీ జ‌గ‌న్నాథ్ త‌న సొంత బ్యాన‌ర్లో ఈసినిమాను తెర‌కెక్కించిన, హీరోయిన్ చార్మీ స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హారిస్తున్నారు. రామ్ కి ఇది 17వ సినిమా కాగా, పూరి జగన్నాథ్ కి ఇది 35వ సినిమా. ఈ ఇద్దరి కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమాకి ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. జ‌న‌వ‌రి 2న ఈసినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను కూడా విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే ఈమూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభంకానున్న‌ట్లు స‌మాచారం.

ismart shankar

ఈచిత్రంలో హీరోయిన్ గా తెలుగు అమ్మాయిని తీసుకోనున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మణిశర్మను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. పూరీ జ‌గ‌న్నాథ్ మ‌ణిశ‌ర్మ కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమాలు ఘ‌న విజయాలు సాధించిన విష‌యం తెలిసిందే. అదే సెంటిమెంట్ తో పూరీ త‌న సినిమాలో ప‌నిచేయాల‌ని మ‌ణిశ‌ర్మ‌ను కోరాడ‌ని స‌మాచారం. ప‌క్కా మాస్ అండ్ కామెడీ ఎంట‌టైన‌ర్ తో తెరకెక్క‌నున్న ఈమూవీని ఐదు నెలల్లో పూర్తి చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. రామ్ ఈసినిమాలో డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపించ‌నున్నాడు.

- Advertisement -