వెంకటేశ్ ఆవకాయ లాంటి వారుః నాని

184
nani speech

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఆవకాయ లాంటి వారన్నారు న్యాచురల్ స్టార్ నాని. తెలుగు వారికి ఎలాగైతే ఆవకాయ పచ్చడి అంటే ఇష్టమో సినిమా ప్రేక్షకులకు కూడా వెంకటేశ్ అంటే అంత ఇష్టం అని చెప్పారు. నాని నటించిన జెర్సీ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా విక్టరీ వెంకటేశ్ హాజరయ్యారు. ఈసందర్భంగా నాని మాట్లాడుతూ..వెండితెరపై చూసి వ్యక్తిగతంగా కలిసిన తర్వాత ఇంకా ఎక్కువ నచ్చిన ఎకైక వ్యక్తి వెంకటేశ్ అన్నారు.

nani123

నేను ఆయన సినిమా ఫంక్షన్ కు గెస్ట్ గా వెళ్లాలనే ఒక కోరిక ఉండేది అది బాబు బంగారంతో తీరిపోయింది..నా సినిమా ఫంక్షన్ కు వెంకటేశ్ గెస్ట్ గా రావాలని ఒక కోరిక కూడా ఉండేది అది జెర్సీ తో తీరిపోయిందన్నారు. ఇక మిగిలింది ఒకే ఒక్క కోరిక అన్నారు నాని. వెంకటేశ్ నేను ఇద్దరం కలిసి ఒకే సినిమాలో నటించడం అన్నారు. వెంకటేశ్ నువ్వు కలిసి మల్టీస్టారర్ సినిమాలో కలిసి నటిస్తే బాగుంటుందని తనను చాలా మంది అడిగారన్నారు. మంచి కథ దొరికితే తప్పకుండా వెంకటేశ్ తో మల్టీస్టారర్ సినిమా చేస్తానని చెప్పారు.

ఏప్రిల్ 19న జెర్సీ సినిమా చూసి ప్రతి ఒక్కరూ గర్వ పడతారని చెప్పారు. బ్లాక్‌బాస్టర్‌ సినిమా లాంటి మాటలు చెప్పాలనిపించడంలేదు. మంచి సినిమా పక్కన అలాంటి పదాలు పెట్టను. గొప్ప సినిమా చేశానన్న సంతృప్తి ఉంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈసినిమా చాలా ఎంత కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసన్నారు. ఈరోజు గౌతమ్ ఇక్కడ మాట్లాడక పోయినా ఎప్రిల్ 19న ఆయన తీసిన సినిమా మాట్లాడుతుందన్నారు నాని.