నితిన్ సినిమాలో ఆమె లేదంట…

586
Nithin-to-romance-Kalyani-P
- Advertisement -

యంగ్ హీరో నితిన్ గత కొద్ది రోజులుగా ఖాళిగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇంత వరకూ ఒక్క సినిమా షూటింగ్ లో కూడా పాల్గోనలేదు. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న నితిన్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. నితిన్ సైన్ చేసిన సినిమాల్లో మొదట ఛలో దర్శకుడు వెంకీ కుడుములతో సినిమా చేయనున్నాడు. ఈసినిమాకు భీష్మ అనే టైటిల్ ను ఖారారు చేశారు. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

అయితే ఈమూవీలో హీరోయిన్ గా రష్మీక మందనను తీసుకున్నారు. సెకండ్ హీరోయిన్ గా ఇటివలే చిత్రలహరి మూవీతో హిట్ కొట్టిన కళ్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై స్పందించాడు దర్శకుడు వెంకీ కుడుముల. ఈసినిమాలో ఒక కథనాయిక మాత్రమే ఉంటుందని ఆ పాత్రకు రష్మీక ను తీసుకున్నామని చెప్పారు.

ఈసినిమాలో సెకండ్ హీరోయిన్ కు అవకాశం లేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. త్వరలోనే ఈమూవీ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని చెప్పాడు. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఛలో మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసినిమాపై విజయం పై చాలా ఆశలు పెట్టుకున్నారు నితిన్.

- Advertisement -