ఇంటర్ ఫలితాలు విడుదల..

278

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల కానున్నయి. ఈ నెల 18న ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామంటూ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన బోర్డు అధికారురులు ఇంటర్‌ వార్షిక పరీక్షలు 2019 ఫలితాల ప్రక్రియ తుది దశకు చేరుకున్నాయని.. ఈ నెల 18న ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు.

నాంపల్లి విద్యాభవన్‌లో ఫలితాలను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఇంటర్ ఫలితాల కోసం results.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇంటర్ పరీక్షలు ఒకేసారి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో గత శుక్రవారం ఫలితాలను విడుదల చేయగా.. తెలంగాణలో 18న విడుదల కానున్నాయి.