సైలెంట్ గా పెళ్లి చేసుకోబోతున్నాడా ?

63
- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పెళ్లికి రెడీ అవుతున్న‌ట్టుగా ఉంది. ఈ 45 ఏళ్ల హీరో కొన్నేళ్ల కింద‌ట తెలుగు అమ్మాయి అనీషా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆరేళ్ల పాటు సహజీవనం చేసిన ఈ జంట ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నారు కానీ, పెళ్లి పీటలు ఎక్కకముందే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఐతే, మ‌రోవైపు విశాల్ నటి అభినయను పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. నిజానికి విశాల్ కూడా అభినయతో కలిసి తిరుగుతున్నాడు అని బాగా ప్రచారం జరిగింది.

దాంతో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్న‌ట్టుగా కొన్నాళ్ల నుంచి ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోబోతున్న‌ట్టుగా ఇప్పుడు రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. పెద్ద హ‌డావుడి లేకుండా సైలెంట్ గా విశాల్ – అభినయ పెళ్లి చేసేసుకోబోతున్న‌ట్టుగా స‌మాచారం. ఈ పెళ్లికి విశాల్ తల్లిదండ్రులు కూడా ఆమోదం తెలిపార‌ట‌! దీంతో లేటు వ‌య‌సులో విశాల్ పెళ్లి కొడుకు కావ‌డ‌మే త‌రువాయ‌ని తెలుస్తోంది.

Also Read:ఆయనే సి‌ఎం.. బి‌ఆర్‌ఎస్ కే పట్టం?

ఐతే, గతంలో హీరో విశాల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమ వ్యవహారం నడిపాడు. క్లోజ్ గా ఉంటే.. రియల్ లైఫ్ లో భార్య కాగలమా? అంటూ ఈ పుకార్లపైన వరలక్ష్మి శరత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ, వరలక్ష్మి శరత్ కుమార్ కి విశాల్ పై ప్రేమ ఉందని అంటారు. మరి అభినయతో విశాల్ ప్రేమ వ్యవహారం పై వరలక్ష్మి శరత్ కుమార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Also Read:హైదరాబాద్‌కు కేజ్రీవాల్..సీఎం కేసీఆర్‌తో భేటీ

 

- Advertisement -