మెర్సీ హోమ్‌లో విశాల్ బర్త్ డే…

131
vishal
- Advertisement -

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో విశాల్ తన బర్త్ డేను మరింత ప్రత్యేకంగా జరుపుకున్నారు. విశాల్ దేవీ ట్రస్ట్ ద్వారా తన దాతృత్వ కార్యకలాపాలను, సామాజిక సేవ చేస్తున్న విశాల్…తన బర్త్ డే రోజున చెన్నైలోని మెర్సీ హోమ్‌ని సందర్శించి బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు.

తరువాత విశాల్ సురభి అనాథాశ్రమానికి వెళ్లారు. అక్కడ పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. వాళ్ళతో కలిసి అక్కడే భోజనం కూడా చేశారు. విశాల్ బర్త్ డే జరిగి రెండు రోజులు అయిన తర్వాత న్యూస్ బయటకు రావడంతో నెటిజన్లు ఆ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ప్రస్తుతం విశాల్ తు పా శరవణన్ దర్శకత్వం లో ‘సామాన్యుడు’ ,ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు.

- Advertisement -