విజయ్‌ ప్రేమకి జానీ ఫిదా..!

166
vijay
- Advertisement -

ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు తమిళ హీరో విజయ్. శుక్రవారం జాని మాస్టర్ బర్త్ డే సందర్భంగా సర్‌ప్రైజ్‌గా ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్‌ని నిర్వహించి ఆశ్చర్యపర్చారు. ప్రస్తుతం విజయ్ హీరోగా బీస్ట్ మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటకు జాని మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్…జాని మాస్టర్ బర్త్ డే వేడుకని నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

సౌత్ లోని అగ్ర హీరోలందరితో తనదైన శైలిలో స్టెప్పులు వేయించాడు జాని మాస్టర్‌.ఆయన బర్త్ డే సందర్భంగా రెండు చిత్రాలను ప్రకటించారు. అందులో ఒకటి “జే1”. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది జానీ మాస్టర్ తొలి చిత్రం. రెండవ చిత్రం… జానీ మాస్టర్ హీరోగా ఓషో తులసీరామ్ దర్శకత్వంలో వహిస్తున్న మూవీ ‘దక్షిణ’.

- Advertisement -