రాజకీయాలపై తమిళ స్టార్ హీరో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టెన్త్, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారిని తమిళనాడులో నియోజకవర్గానికి అయిదుగురి చొప్పున పిలిపించి వారికి విజయ్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ పేరిట ఐదువేల రూపాయలు అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్…రేపటి ఓటర్లు మీరే. మీరు భవిష్యత్తు నాయకులను ఎన్నుకుంటారు. ఓట్లను డబ్బులకు అమ్ముకొని మన చేత్తో మన కళ్ళనే పొడుచుకుంటున్నాము. ఒక రాజకీయ నాయకుడు ఒక ఓటుకు 1000 రూపాయలు ఇస్తే మహా అయితే నియోజకవర్గం మొత్తం పంచడానికి రఫ్ గా 15 కోట్లు అవుతుంది అనుకుందాం అన్నారు.
Also Read:దశాబ్ది ఉత్సవాలు..తెలంగాణ హరితోత్సవం
15 కోట్లు ఊరికే పంచిపెడుతున్నాడంటే ఆ వ్యక్తి ఇంకెంత సంపాదించి ఉంటాడు పాలిటిక్స్ లో అని మీరు ఆలోచించాలి. డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలని మీ తల్లితండ్రులకు మీరే చెప్పాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో చర్చగా మారాయి.
Also read:హ్యాపీ ఫాదర్స్ డే…