గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరో వేణు..

580
hero venu
- Advertisement -

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సినీ హీరో వేణు తొట్టెంపూడి గురువారం ఉదయం మాదాపూర్‌లో తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంచేందుకు గ్రీన్ ఛాలెంజ్ పేరుతో జరుగుతున్న మహా ప్రయత్నంలో తాను పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని వేణు ఈ సందర్భంగా అన్నారు.

కాగా, వేణు పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరంచి మొక్కలు నాటినందుకు అభినందనలు తెలిపారు.

- Advertisement -