అన్ని ప్రోజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చాం: రజత్‌కుమార్‌

286
Rajat Kumar IAS
- Advertisement -

కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ,ఆంధ్రపదేశ్‌ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు, ఇంజినీర్లు తమ వాదనలు వినిపించారు. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున వినిపించిన వాదనలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ వెల్లడించారు.

కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై ప్రజెంటేషన్‌ ఇచ్చామని రజత్‌ కుమార్‌ తెలిపారు. 16.5 టీఎంసీలు హైదరాబాద్‌కు రావాలని తెలిపారు. తాగునీటి కేటాయంపులను 20 శాతం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని వాటి లెక్కలు కూడా చూపించామని రజత్‌కుమార్‌ తెలిపారు. పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించి ఆ మేరకు అదనపు జలాలను ఇవ్వాలని కోరినట్లు రజత్‌ కుమార్‌ చెప్పారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన పలు పెండింగ్‌ విషయాలపై బోర్డు కు తెలిపామన్నారు.

- Advertisement -