స్టేజిపైనే కంటతడి పెట్టిన స్టార్ హీరో

794
Surya-Emotional
- Advertisement -

ప్రముఖ హీరో సూర్య నటుడిగానే కాకుండా చాలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటాడన్న సంగతి తెలిసిందే. తమిళనాడులో చాలా మంది నిరుపేదలకు సూర్య అండగా నిలిచాడు. అగరం ఫౌండేషన్‌ ద్వారా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. గత పదేళ్లుగా ఆయన ఈ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో హీరో అనిపించుకున్న ఎకైక హీరో సూర్య అని చెప్పుకోచ్చు.. తాజాగా అగరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మంత్రి సెంగొట్టెయాన్‌ చీఫ్‌, సూర్య గెస్ట్‌‌లుగా వచ్చారు.

ఈ కార్యక్రమంలో ఓ యువతి ప్రసంగానికి చలించిపోయారు హీరో సూర్య. తాను చిన్నప్పుడు చదువుకోవడానికి పడిన కష్టాలను వివరిస్తుంటే సూర్య ఏడ్చేశాడు. వెంటనే ఆ యువతి దగ్గరకు వెళ్లి హత్తుకున్నారు. నా తండ్రి చనిపోయాక, నేను కూలి పని చేసుకుంటూ నా తల్లికి సహాయపడ్డాను. అప్పుడు హీరో సూర్య నాకు సాయం చేసి ఈ స్థితిలో ఉండటానికి కారణమయ్యారని కన్నీరు పెట్టింది ఆ యువతి. సూర్య ఏడ్చిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -