హీరో సూర్య ఎమోషనల్!

77
suriya
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా 2020 సంవత్సరానికి సంబంధించిన 68వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డుల జాబితాను ప్రకటించారు. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సూరరై పొట్రు సినిమాకి అయిదు నేషనల్ అవార్డులు వచ్చాయి.

తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథతో సుధా కొంగర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సూరరై పొట్రుకి అయిదు నేషనల్ అవార్డులు రావడంతో సూర్య ఎమోషనల్ ట్వీట్ చేశారు.

సూరరై పొట్రుకు ఐదు జాతీయ అవార్డులు రావడం ఆనందంగా ఉంది. కరోనా సమయంలో నేరుగా OTTలో విడుదలైన మా చిత్రానికి అద్భుతమైన ఆదరణ మా కళ్ళను ఆనందంలో ముంచెత్తిందని తెలిపారు. అపర్ణ బాలమురళి (ఉత్తమ నటి), జి.వి.ప్రకాష్ (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్), సుధా కొంగర & షాలిని ఉషా నాయర్ (ఉత్తమ స్క్రీన్‌ప్లే)లకు నా హృదయపూర్వక అభినందనలు అని చెప్పారు.

- Advertisement -