గ్రీన్ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన హీరో సునీల్‌..

491
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ముక్రాకె గ్రామంలో 500 చెట్లు నాటడం జరిగింది.. ఇప్పటికే 7000 చెట్లు నాటిన గ్రామస్తులకు సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.

ఈ రోజు గాంధీ 150వ జయంతి సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా తిరుమలగిరి గ్రామంలో 6000 మొక్కటు నాటారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సునీల్,ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని గ్రామస్తులతో పాటు మొక్కటు నాటారు.

- Advertisement -