మా ఎన్నికలు…సుమన్ సంచలన వ్యాఖ్యలు

31
suman

మా ఎన్నికల నేపథ్యంలో నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ను ప్రకటించి సభ్యులను ఆకట్టుకుంటుండగా మనోజ్ ఇంకా ప్యానల్ ప్రకటించకుండానే ఒక్కొక్కరిని కలుస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మా ఎన్నికలపై అందరి దృష్టి నెలకొనగా నటుడు సుమన్ మా ఎన్నికలపై స్పందించారు. మా అధ్యక్ష పదవి అనేది చాలా ముఖ్యమైన పోస్ట్ అని.. అందరి కష్టసుఖాలు చూసుకుంటూ ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. బిజీగా ఉన్న ఆర్టిస్టులకు ఆ పోస్ట్ కరెక్ట్ కాదనేది తన అభిప్రాయమన్నారు.

తాను సినిమాల పరంగా బిజీగా ఉన్నాను కాబట్టే మా ఎన్నికల్లో పోటి చేయడం లేదన్నారు. తనకు రెండు పడవల మీద కాలు పెట్టడం ఇష్టం లేదన్నారు. డ్రగ్స్ లాంటి కేసుల్లో ఇతర దేశాల్లాగా మన దేశంలో కూడా కఠినమైన శిక్షలు అమలు చేయాలని కీలక వ్యాఖ్యలు చేశారు.