బిగ్ బాస్ 5 తెలుగు..సండే ఫన్‌ డే

86

బిగ్ బాస్ 5 తెలుగు సక్సెస్ ఫుల్‌గా తొలివారం పూర్తి చేసుకుంది. వీకెండ్ ముఖ్యంగా సండే ఫన్‌ డేగా సాగిపోయింది. నాగ్ ఇంటిసభ్యులను అలరిస్తూ వారితో సరదా ఆటలు ఆడించారు. తొలుత ఇంట్లో ఏం జరుగుతుందో చూసిన నాగ్ తర్వాత ఇంటి సభ్యులను పేరు పేరున పలకరిస్తూ అలరించారు. ఫస్ట్ వీక్ కాబట్టి ఇప్పుడే వారికి క్లాస్ పీకడం సరికాదని ఈ వారం వదిలేద్దామని చెప్పారు నాగ్.

తొలుత ఇంట్లోని పందొమ్మిది మందిలో జెస్సీని పక్కన పెట్టి మిగిలిన వారిని జంటలుగా విడిపోయి ఏదైనా ఒక ప్రాపర్టీని వాడి ర్యాంప్ వాక్ చేయాలని సూచించారు నాగ్. తొలుత యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ ర్యాంప్ వాక్ చేసి అలరించగా తర్వాత ఒక్కొక్కరుగా ర్యాంప్ వాక్ చేసి ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. ఇందులో ముఖ్యంగా లోబో, ఉమా దేవీ రెచ్చిపోయి ర్యాంప్ వాక్ చేసి కడుపుబ్బా నవ్వించారు.

చివరగా ప్రియాంక, శ్వేతా వర్మ వచ్చి.. ర్యాంప్ వ్యాక్‌కు ముగింపు పలికారు. అయితే వీరిద్దరి ర్యాంప్ వాక్‌ అందరిని మెస్మరైజ్ చేసింది. కన్నుల పండువగా వీరిద్దరు ర్యాంప్ వాక్ చేయగా మిగితా కంటెస్టెంట్స్ సైతం చప్పట్లతో ఎంజాయ్ చేశారు. వీరి ర్యాంప్ వాక్ అలా ముగిసిందో లేదో జెస్సీ మాత్రం 10 ,నాగ్ కూడా 10 మార్కులు ఇచ్చేశాడు.

ఇక ఎలిమినేషన్‌లో ఉన్న నలుగురిలో ఒకరిని సేఫ్ చేసే సమయం రాగా వారికి యాపిల్స్ ఇచ్చి కత్తితో కట్ చేయమన్నాడు నాగ్. ఎందులో అయితే ఎర్రగా ఉంటే వారు సేఫ్ కాదని చెప్పేశాడు. అయితే మానస్ కట్ చేసిన యాపిల్ మాత్రమే ఎర్రగా లేదు. దీంతో మానస్ సేఫ్ అయ్యారు. ఇక తర్వాత కూడా నేను మీకు తెలుసా? అంటూ నాగార్జున కంటెస్టెంట్లతో మరో ఆట ఆడించాడు. ఇందులో భాగంగా తొమ్మిది జంటలుగా కంటెస్టెంట్లుగా విడగొట్టాడు. గేమ్‌లో గుమ్మడికాయగా లోబోను పక్కన పెట్టేశాడు.

ఇందులో నాగార్జున అందరి మధ్య ఫిట్టింగ్ పెట్టే ప్రయత్నం చేయగా సిరి, జెస్సీలను మొదటగా పిలిచి ఇద్దరి మధ్య ఉన్న రహస్యాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. అలా అన్ని జంటలను నాగ్ ఇరికించే ప్రయత్నం చేశాడు. ఈ ఆట తరువాత కాజల్ సేవ్ అయిపోయినట్టు ప్రకటించారు.

ఇక చివరగా ఎలిమినేషన్ ప్రకియ ముగింపుకు రాగా ఇద్దరు జెస్సీ,సరయులో ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకునేందుకు కాస్త టెన్షన్ పెట్టేశాడు నాగ్. ఇందు కోసం సైకిళ్లను సెటప్ చేసేశాడు. జెస్సీ సైకిల్ లైట్ వెలగడంతో అతను సేఫ్ అయినట్టు ప్రకటించాడు.