కోలీవుడ్‌లోకి సుహాస్!

16
- Advertisement -

షార్ట్ ఫిల్మ్స్‌ తో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హీరోగా ఎదిగిన నటుడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో భారీ హిట్ కొట్టారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో సుహాస్ కెరీర్ మారిపోయింది. తర్వాత రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు, ప్రసన్న వదనం.. సినిమాలతో హిట్స్ కొట్టాడు. హీరోగా చేస్తూ హిట్ 2లో విలన్‌గా అలరించాడు.

ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను అలరించిన సుహాస్ ఇప్పుడు కోలీవుడ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు రెడీ అయ్యాడు. కోలీవుడ్ హీరో సూరి నటిస్తున్న చిత్రం “మందాడి”లో నటించనున్నాడు.

దీంతో సుహాస్ కోలీవుడ్ డెబ్యూ పై ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని మథిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తుండగా సుహాస్ తో పాటుగా కట్టప్ప సత్యరాజ్, కేజీఎఫ్, కాంతార విలన్ అచ్యుత్ లాంటి నటులు కూడా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Also Read:ఎన్టీఆర్ బర్త్ డే..నీల్ ట్రీట్!

- Advertisement -