టాలీవుడ్‌లో కరోనా కలకలం..

53
srikanth

టాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా హీరో శ్రీకాంత్, అనీ మాస్టర్‌లకు పాజిటివ్‌గా తేలింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నాకు కొన్ని రోజుల నుంచి కొన్ని లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా కరోనా అని తేలింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోండి అని పోస్ట్ చేశాడు.

కొరియోగ్రాఫ‌ర్‌, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అనీ మాస్ట‌ర్ క‌రోనా బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది. గ‌తేడాది కూడా నాకు కోవిడ్ వ‌చ్చింది. కరోనా వచ్చిన 24 రోజుల త‌ర్వాత 2021 జ‌న‌వ‌రి 23న నాకు క‌రోనా త‌గ్గిపోయింది. మ‌ళ్లీ ఇప్పుడు 2022 జ‌న‌వ‌రి 23న కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ కరోనా నా లాగా టైం మెయింటెన్ చేస్తుంది. క్వారంటైన్ చిరాకుగా, చాలా బోరింగ్‌గా ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.