తెలుగు సినిమా పరిశ్రమలో హీరో శ్రీకాంత్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన వారిలో ఆయన కూడా ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే,ఎంతటి వారికైనా కెరియర్ విషయంలో ఒడిదుడుకులు తప్పవు. అయితే వాటిని ఎదుర్కొని నిలబడాలి. అప్పుడే సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. హీరో శ్రీకాంత్ జీవితంలో జరిగిన ఈ ఘటన వింటే మీకూ అదే ఫీల్ కలుగుతుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ సోదరి నిర్మల అతని గురించిన ఓ ఆసక్తికర మైన విషయం చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుండే శ్రీకాంత్ కు సినిమాలంటే పిచ్చి ఉండేదని, నటుడిగా తనను తాను నిరూపించుకోవాలని తహతహలాడే వాడని, ఈ క్రమంలో చదువును నిర్లక్ష్యం చేయడంతో శ్రీకాంత్ తండ్రి మందలించడంతో మనస్థాపం చెందిన కాలువలో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడట. ఆ తర్వాత అతన్ని ఇష్ట ప్రకారం సినిమా పరిశ్రమలోకి వెళ్లడానికి శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారట.
మరోసారి అలాంటి పని చేయకుండా శ్రీకాంత్ ని ఓ కంట కనిపెట్టాలని ఆమెకి తన తల్లి చెప్పిందట. ఈ చిన్ననాటి విషయాలను శ్రీకాంత్ సోదరి బయటకు వెల్లడించారు. ఆ తర్వాత శ్రీకాంత్ కెరీర్ పతన దశలో ఉన్నపుడు మరోసారి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కానీ.. చిరంజీవి మోటివేషన్ ఆ ఆలోచనలను మార్చుకున్నాడు. ఆ తర్వాత ఇక వెనుతిరిగి చూసుకోకుండా అంచెలంచెలుగా ఎదిగాడు శ్రీకాంత్.